హైదరాబాద్‌లో క్రిప్టో మోసం.రూ. 7 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

ఎస్ఆర్ నగర్,జులై 2,(జే ఎస్ డి ఎం న్యూస్) :
నగరంలో క్రిప్టో కరెన్సీ పేరుతో సరికొత్త మోసంవెలుగుచూసింది. యూఎస్‌డీటీ (USDT) కాయిన్స్ అమ్ముతామని నమ్మించి ఒక యువకుడిని బురిడీ కొట్టించిన కేటుగాళ్లు రూ. 7 లక్షల నగదుతో పరారయ్యారు.
బాధితుడి కథనం ప్రకారం. ……యూఎస్‌డీటీ కొనుగోలు చేసేందుకు సదరు యువకుడు నిందితులను సంప్రదించాడు. దీనిని ఆసరాగా చేసుకున్న మోసగాళ్లు యువకుడిని నమ్మించి అతని వద్ద నుంచి రూ. 7 లక్షల నగదు తీసుకున్నారు. అయితే, డబ్బులు చేతికి అందిన తర్వాత సదరు డిజిటల్ నగదు బాధితుడి అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయకుండా మొహం చాటేశారు. తాను మోసపోయామని గ్రహించిన బాధితుడు వెంటనే ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎస్.ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. క్రిప్టో కరెన్సీ పేరుతో జరుగుతున్న ఈ కొత్త తరహా మోసంపై నిఘా పెట్టినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. ఇలాంటి క్రిప్టో లావాదేవీలు, డిజిటల్ కరెన్సీ కొనుగోళ్ల విషయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులను నమ్మి నగదు ఇచ్చి మోసపోవద్దని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *