బేగంపేట జులై 7,(జే ఎస్ డి ఎం న్యూస్) :
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన 236వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 320 దరఖాస్తులు అందాయి. వాటిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 150, రెవెన్యూ శాఖకు సంబంధించి 46, హోం శాఖకు 21, ప్రవాసి ప్రజావాణికి 02 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 101 దరఖాస్తులు అందాయి. ఈ కార్యక్రమంలో సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్ దరఖాస్తులను స్వీకరించి ఎండార్స్ మెంట్ చేసి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు.
సీఎం ప్రజావాణి, ప్రవాసి ప్రజావాణిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సందర్శించారు. సీఎం ప్రజావాణి అమలు జరుగుతున్న తీరును పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఏ.సీ.పీ. ఉమేందర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై సమన్వయ మండలి చైర్మన్ వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీం రెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస్ రావు, సమన్వయకర్త బొజ్జ అమరేందర్ రెడ్డి, ప్రతినిధి పద్మారాణి కర్రి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
