బేగంపేట జులై 7, (జే ఎస్ డి ఎం న్యూస్) : రసూల్‌పురా చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మహమ్మద్ ఖాజా మేరజూద్దీన్ (35) అనే ఆకతాయికి కోర్టు ఐదు రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. రసూల్‌పురా గన్ బజార్‌కు చెందిన నిందితుడు శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఎవరూ చూడటం లేదనుకుంటే కుదరదని, సీసీటీవీ నిఘా క్షేత్రాలు నిరంతరం పహారా కాస్తూనే ఉంటాయని బేగంపేట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సైదులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం, ధూమపానం సేవించిన వారికి, సరైన పత్రాలు మరియు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారికి, రాత్రి సమయాల్లో రోడ్లపై జులాయిగా తిరిగే వారిపై పోలీసులు పెట్టీ కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో దాదాపు పది మందికి కోర్టు జరిమానాతో పాటు సోషల్ సర్వీస్ (సామాజిక సేవ) చేయాలని శిక్ష ఖరారు చేసింది. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు.
