శ్యామ్ లాల్ బిల్డింగ్ లో ఎంఆర్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…..మంద కృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు

బేగంపేట జులై 7, (జే ఎస్ డి ఎం న్యూస్) :
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) 32వ ఆవిర్భావ దినోత్సవం, ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలను కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని శ్యామలాల్ బిల్డింగ్ లో ఘనంగా నిర్వహించారు. ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర నాయకులు గ్యార రమేష్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంఎస్‌పీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు టి. వి. నర్సింహారావు మాదిగ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ గత 30 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు. మాదిగ జాతికి హక్కులు, ఆత్మగౌరవాన్ని తెచ్చిపెట్టి, వర్గీకరణ సాధించడం ద్వారా జాతికి వందేళ్ల భవిష్యత్తును అందించిన మహా యోధుడు ఆయనేనని ప్రశంసించారు. కేవలం మాదిగలే కాకుండా సమాజంలోని తాడిత, పీడిత, వెనుకబడిన అన్ని వర్గాలకు అండగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన సమాజానికి చేసిన సేవలను గుర్తించే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఆయననాయకత్వంలో మరిన్ని ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములు అవుతామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ నాయకులు మేకల మోహన్ మాదిగ, మీసాల రంగా మాదిగ, మేకల శ్యామ్ మాదిగ, సేవల లక్ష్మణ్ మాదిగ, బూరజకుంట నరేందర్ మాదిగ, బూరుజకుంట శ్యామ్ మాదిగ, బంగారు శ్యామ్ మాదిగ, బంగారు పృద్వి మాదిగ, బత్తుల వినోద్ మాదిగ, పొన్నాల నటరాజ్ మాదిగ, బి జే పి నాయకులు యామగోని గంగాధర్ గౌడ్, ఎరుకల సంఘం నాయకులు కేంబా సారం సురేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *