బేగంపేట జులై 7,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి సమక్షంలో
సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా కే.విద్యాసాగర్ మంగళవారం బాధ్యతలుస్వీకరించారు.ఇప్పటివరకు సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగాబాధ్యతలు నిర్వహించిన దివ్య దేవరాజన్పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ గా బదిలీ కావడంతో కొత్తగా పోస్టింగ్ అయిన విద్యాసాగర్ కు ఛార్జ్అప్పగించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ జీ.చిన్నారెడ్డి వారిద్దరికీశుభాకాంక్షలు తెలిపారు. దివ్య దేవరాజన్ అందించిన సేవలను చిన్నారెడ్డి కొనియాడారు. నూతన స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్ ఆధ్వర్యంలో సీఎం ప్రజావాణి కార్యక్రమం మరింత సజావుగా సాగుతుందని చిన్నారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
