బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే
కఠిన చర్యలు తప్పవని ఎస్సై ఎస్.మల్లికార్జున రావు హెచ్చరించారు. మండలంలోని తూర్పు గంగవరం శివారు ప్రాంతాల్లో పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. మందుబాబులు మద్యం తాగే పరిసరాలను గుర్తించి సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి శుభ్రం చేయించారు. కార్యక్రమంలో పిసీలు మాలకొండయ్య, బాబు పాల్గొన్నారు.


