సికింద్రాబాద్, జులై 15,(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆషాడ బోనాల జాతర ఉత్సవాల సందడి అప్పుడే మొదలైంది. ఇందులో భాగంగా బుధవారం ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు మరియు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు సంయుక్తంగా దేవాదాయ శాఖ (ఎండోమెంట్) కమిషనర్ హనుమంతరావుని మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషనర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో కలిసిన ప్రతినిధి బృందం ఆషాడ బోనాల జాతర మహోత్సవాల తొలి ఆహ్వాన పత్రికను వారికి భక్తిశ్రద్ధలతో అందజేసారు.
ఈ సందర్భంగా కమిషనర్ హనుమంతరావుని శాలువాతో సత్కరించి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. సికింద్రాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల మహోత్సవానికి కుటుంబ సమేతంగా విచ్చేసి, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాల్సిందిగా ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి, అర్చకులు, ఎక్స్ అఫిషియో
మెంబర్ రామతీర్థ శర్మ మరియు ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఆయనను ఆహ్వానించారు. జాతరవిజయవంతానికి అవసరమైన ఏర్పాట్లపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉజ్జయిని మహంకాళి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్లు గుండెల్లి దేవి వరప్రసాద్ ,చెక్కల రాజేందర్ ముదిరాజ్,డాక్టర్ శివలాల్ ,గంటా గీత,రాకేష్ అగర్వాల్,సోనాల్,ఆలయ వేద పండితులు వేణు మాధవశర్మ అర్చకులు ఉన్నారు.

