ఓటర్ల సవరణ హెల్ప్ డెస్క్‌నుపరిశీలించిన బీజేపీ యువ నాయకుడు మర్రి పురురవ రెడ్డి.

బేగంపేట జులై 15(జే ఎస్ డి ఎం న్యూస్) :
సనత్ నగర్ నియోజకవర్గం లోని బేగంపేట డివిజన్ పరిధిలో జరుగుతున్న ఎస్ ఐ ఆర్ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఐఆర్‌-2026) ప్రక్రియలో భాగంగా బేగంపేట్ డివిజన్‌లో ప్రత్యేక ఓటర్ల సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. డివిజన్‌ పరిధిలోని బూత్ నెంబర్లు 37, 38 లలో ఓటర్లకు అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాలను సులభంగా పూరించేందుకు వీలుగా ఈ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ యువ నాయకుడు మర్రి పురురవ రెడ్డి ఈ కేంద్రాన్ని సందర్శించి, ఇక్కడ జరుగుతున్న ఓటర్ల సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయనతో పాటు బేగంపేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ముదిరాజ్ కూడా పాల్గొన్నారు. కేంద్రానికి వస్తున్న స్థానిక ప్రజలతో మాట్లాడి, ఓటరు నమోదు మరియు సవరణల్లో ఎదురవుతున్న ఇబ్బందులను వారు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సవరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ పరిశీలన కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు బాబు రావు, శ్రీ రామ్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *