ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన గోనుగుంట నాగరాజు ప్రతిష్ఠాత్మకమైన ఆల్ ఇండియా రేడియో (ఆకాశవాణి) లో నాదస్వర విభాగం బి-గ్రేడ్ ఆర్టిస్టుగా ఎంపికయ్యారు. 2024లో నిర్వహించిన ఆల్ ఇండియా రేడియో ఆడిషన్లో ప్రతిభ కనబరిచి ఈ అరుదైన గుర్తింపు పొందారు. దర్శి ప్రాంతం నుండి నాదస్వర విభాగంలో ఈ ఘనత సాధించడం విశేషం. ఈ సందర్భంగా గోనుగుంట నాగరాజుకు పలువురు బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు, సంగీతాభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు.
