సికింద్రాబాద్, జూలై 19 (జే ఎస్ డి ఎం న్యూస్)
మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలేనని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం మోండా డివిజన్ ఆదయ్య నగర్ లోని 18 దేవాలయాలలో బోనాల పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాలలోని మహంకాళి అమ్మవారు, నల్ల పోచమ్మ అమ్మవార్లను దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో డప్పు చప్పుళ్ళు, పోతురాజుల నృత్యాలతో ఆ ప్రాంతమంతా భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక సందడిగా మారింది. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తలసాని స్కైలాబ్ యాదవ్, ఆలయ నిర్వాహకులు ఏకాంబరం, సాయిబాబా, చంద్రశేఖర్, జ్ఞానేశ్వర్, రాములు, భాస్కర్, రాజు, అలాగే పార్టీ నాయకులు శ్రీకాంత్, ప్రమోద్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


