అరిథ్మియా చికిత్సలోతాజాపరిణామాలపై కిమ్స్‌లో జాతీయ సదస్సు.దేశవ్యాప్తంగా ప్రముఖ హార్ట్ రిథమ్ నిపుణుల హాజరు. 500 మందికార్డియాలజిస్టులు, వైద్యులు, ఫెలోలకు శిక్షణ.

హైదరాబాద్, జూలై 20,(జే ఎస్ డి ఎం.న్యూస్)
గుండె స్పందనలో ఏర్పడే అసాధారణ సమస్యలు(అరిథ్మియా ) గుర్తింపు, చికిత్సలో తాజా పరిణామాలపై వైద్యులకుఅవగాహన కల్పించే లక్ష్యంతో అరిథ్మియా  రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సొసైటీ (ఏఆర్ టిఎస్)ఆధ్వర్యంలో, కిమ్స్ హాస్పిటల్స్ సహకారంతో శనివారంసికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని కిమ్స్ ఆసుపత్రిలో ఒకరోజు జాతీయ అరిథ్మియా  సింపోజియం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది కార్డియాలజిస్టులు, ఫిజీషియన్లు, కార్డియాలజీ ఫెలోలు ఈ సదస్సులో పాల్గొన్నారు.దేశంలోని ప్రముఖ
ఎలక్ట్రోఫిజియాలజిస్టులతో పాటు  అంతర్జాతీయ నిపుణుడు కూడా అధ్యాపక బృందంలో పాల్గొని ప్రసంగించారు.
సింపోజియం కోర్సు డైరెక్టర్, కిమ్స్ హాస్పిటల్స్ చీఫ్ ఆఫ్ ఎలక్ట్రోఫిజియాలజీ అండ్ పేసింగ్ డివిజన్, ఏఆర్ టిఎస్ అధ్యక్షుడు డాక్టర్ బి. హైగ్రీవ్ రావు మాట్లాడుతూ, గుండె స్పందన సంబంధిత వ్యాధుల చికిత్సలోవిజయవంతమైన ఫలితాలు సాధించాలంటే కేవలం చికిత్సా విధానాలు మాత్రమే కాకుండా వైద్యులు సరైన సమయంలో సరైన క్లినికల్ నిర్ణయాలు తీసుకోవడం అత్యంత కీలక
మన్నారు. రోగి
లక్షణాలు, ఆధునిక నిర్ధారణ పరీక్షలు, అంతర్జాతీయ వైద్య మార్గదర్శకాలను సమన్వయం చేస్తూ చికిత్స నిర్ణయాలు తీసుకునేనైపుణ్యాన్నిపెంపొందించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని తెలిపారు.వాస్తవ జీవితంలో ఎదురైన క్లిష్టమైన కేసులను అనుభవజ్ఞులైన నిపుణులువిశ్లేషించడం ద్వారా పాల్గొన్న వైద్యులు వ్యాధి నిర్ధారణ, శాస్త్రీయ ఆధారాలతో కూడిన చికిత్స, ఒక్కో రోగికి అనుగుణంగా వైద్యం అందించే విధానాలపై లోతైన అవగాహన పొందారని చెప్పారు. ఈ శిక్షణ రోజువారీ వైద్య సేవల్లో మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు.సింపోజియాన్నిప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్, చీఫ్ క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ సంబిత్ సాహూమాట్లాడుతూ, హార్ట్ రిథమ్ నిపుణుల సేవలు అందుబాటులోకి రావడంతో కార్డియాలజీ రంగంలో రోగులకు అందుతున్న వైద్య సేవల ప్రమాణాలు మరింతమెరుగుపడ్డాయని అన్నారు. యువ వైద్యులు దేశంలోని ప్రముఖ హార్ట్ రిథమ్ నిపుణుల నుంచి నేర్చుకునీ ఇలాంటి అవకాశాలను పూర్తిగాసద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కిమ్స్‌లో డాక్టర్ హైగ్రీవ్ రావు నాయకత్వంలోని అరిథ్మియా  విభాగం నిర్వహిస్తున్న పరిశోధనలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని, తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్సా విధానాల అభివృద్ధికి దోహదపడుతున్నాయని డాక్టర్ సంబిత్ సాహూ తెలిపారు. దేశంలోని ప్రముఖ నిపుణులఅనుభవాలను పంచుకునే ఈ సదస్సు వైద్యుల విజ్ఞానాన్ని మరింత విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైద్యులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *