ఫ్రీ మాన్ నూన్ డ్రై స్పేల్ విత్తనాలు పంపిణీ

వాతావరణ అనిశ్చితి తీవ్రంగా ఉన్న తరుణంలో ఫ్రీ మాన్ సూన్ డ్రై స్పేల్ విత్తన
బంతు
లను పోలాల్లో చల్లు కోవాలని తద్వార బహుళ ప్రయోజనాలు ఉన్నాయని మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు చెప్పారు. శివ రామ పురం, మల్కాపురం గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. తాళ్ళూరు మండలంలో ఇప్పటి వరకు 918 మంది రైతులకు 1059 ఎకరాలలో పీఎండి ఎస్ విత్తన బంతులు వేసినట్లు చెప్పారు. అన్ని గ్రామాలలో రైతులకు ప్రకృతి సాగు పెంచే విధంగా చైతన్య పరుస్తున్నట్లు తెలిపారు. పీఎండిఎస్ వలన ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. గ్రామ కార్యదర్శి షేక్ షహనాజ్ బేగం, విఏఏ వెంకట రాజా, విఏ హెచ్ రాజేష్, ఐసీఆర్పీలు రైతులు, మహిళలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *