విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని వక్తలు అన్నారు. మండలంలో
ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం మోగా పెరేంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. తాళ్లూరు వికే ఉన్నత పాఠశాలలో జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, ఎంపీ ప్రాధమిక పాఠశాల వెంకట రెడ్డి పాలెంలో ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, కస్తూరిభాలో మండల విద్యాశాఖాధికారి జి నుబ్బయ్య, వెలుగు వారి పాలెం ప్రాధమిక పాఠశాల (ఏఏ)లో ప్రధానోపాధ్యాయుడు పోలంరెడ్డి సుబ్బా రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొని, వికే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ వేణు గోపాల్, జెడ్పీ ఉన్నత పాఠశాల తూర్పుగంగవరంలో సొసైటీ చైర్మన్ వల్లభనేని సుబ్బయ్య, హెచ్ఎం వైఎన్ ఆర్ కే ప్రసాద్‌లు పాల్గొని సందేశం ఇచ్చారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ ను సమూలంగా ప్రక్షాళన చేస్తూ అత్యన్నత ప్రమాణాలతో కూడిన విద్యను కూటమి ప్రభుత్వం అందిస్తుందని. అందుకు క్రమం తప్పకుండా తల్లికి వందనం నగదు ను అందిస్తూ విద్యార్థులను ప్రొత్సహిస్తుందని చెప్పారు. తమ బిడ్డల విద్యా ప్రగతిని చర్చించేందుకే ప్రభుత్వం మోగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులను కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. ఆయా కార్యక్రమాలలో ఎంఈఓ -2 సుధాకర్ రావు లు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొని నందేశం ఇచ్చారు.
