హైదరాబాద్ జులై 27,(జే ఎస్ డి ఎం న్యూస్)
ఎముకలు,
కండరాలు, కొవ్వు,
రక్తనాళాలు, నరాలు వంటి శరీరంలోని మృదు కణజాలాలు మరియుఎముకలలోవచ్చే అరుదైన క్యాన్సర్ అయిన సార్కోమాపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్ మరియు సన్‌షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సంజీవయ్య పార్క్‌లో ‘సార్కోమా స్టెప్స్’ వాకథాన్ నిర్వహించారు.
ఈ వాకథాన్‌ను బోన్ అండ్ జాయింట్ ఇన్‌స్టిట్యూట్ మరియు ఎండీ, కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్
ఎం డి డా. ఏ .వి.గురవారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సార్కోమా అనేది చాలా అరుదుగా కనిపించే క్యాన్సర్ అని, ప్రతి 100 క్యాన్సర్ కేసుల్లో కేవలం ఒక కేసు మాత్రమేసార్కోమాగానమోదవుతుందని తెలిపారు.
అయితే ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్సవిజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగాఉంటాయని చెప్పారు.
ఆలస్యంగా గుర్తిస్తే క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్, టార్గెటెడ్ థెరపీ వంటి ఆధునిక చికిత్సలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్రీడలు లేదా ఇతర కారణాల వల్ల గాయాలైన తర్వాత వాపు, కండరాల నొప్పి లేదా కణితులు మూడు నుంచి ఆరు వారాలకు పైగా కొనసాగితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆంకాలజీనిపుణులను సంప్రదించాలని సూచించారు. సమయానికి చికిత్స తీసుకుంటేక్యాన్సర్‌నునియంత్రించడమే కాకుండా, ప్రభావిత అవయవాన్ని తొలగించాల్సిన అవసరం లేకుండా కాపాడే అవకాశం ఉంటుందనివివరించారు.ఈ కార్యక్రమంలో డా. మాధవ్ దంతాల (సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ ఫిజీషియన్), డా. సోమ శ్రీకాంత్ (సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ & లాపరోస్కోపిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్), డా. నవ్య మానస (కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ ఫిజీషియన్) సార్కోమా మరియు బోన్ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ ప్రసంగించారు. వాకథాన్‌లో డా. కుషాల్ (కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్), విద్యార్థులు, యువత, నర్సింగ్ సిబ్బంది మరియు ఆసుపత్రి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

