పొదుపు సంఘాల సకాలంలో రుణాలు చెల్లించి మరింత పరపతి పొంది రుణ పరిమితిని పెంచుకోవాలని బ్యాంకు డివిజన్ మెనేజర్లు లీలా ప్రతాప్, కె క్రిష్ణ ప్రసాద్ లు చెప్పారు. వెలుగు కార్యాలయంలో సోమవారం మండల మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఎంఎం ఎస్ అధ్యక్షురాలు సుజాత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధులు పాల్గొన్న డివిజన్ మెనేజర్లు ( డీఎం లు) మాట్లాడుతూ పొదుపు సంఘాల వారి కుటుంబాల అభ్యున్నతికి రుణాలు చక్కగా ఉపయోగపడుతున్నాయని చెప్పారు, రెండు రోజులలో రెండు కోట్ల మేర రుణాలు అందించటానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కెనరా బ్యాంకు మెనేజర్ సాయి పృద్వి, ఎపీఎం దేవ రాజ్, సీసీ కోటేశ్వర రావు, అకౌంటెంట్ కుమారి తదితరులు పాల్గొన్నారు.
