సికింద్రాబాద్,జూలై 27 (జే ఎస్ డి ఎం న్యూస్) :
లష్కర్ ఆషాడ బోనాల ఉత్సవాల్లో భాగంగాసికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహాకాళిఅమ్మవారి ఆలయంలో ఆషాఢ బోనాల సంబరాలు వైభవంగాకొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారంమహాకాళి అమ్మవారి ఘటాన్ని ఉప్పర్‌బస్తి అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో పోతరాజుల విన్యాసాలు, నృత్యాలు భక్తులను విశేషంగాఆకట్టుకోగా, వందలాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి తెలియ జేశారు.

సోమవారం రాష్ర్ట మంత్రి డి.శ్రీధర్ బాబును కలిసిన ఆలయ ఈ ఓ గుత్తా మనోహర్ రెడ్డి ,ట్రస్ట్ బోర్డ్ మెంబర్లు డి.దేవీ వర ప్రసాద్ ,చెక్కల రాజేందర్ ముదిరాజ్,ముప్పిడి కిరణ్,సోనాలి సునీల్,రమేష్ ,గంట గీత సుధీర్ కుమార్ , గుంటి మల్లికార్జున్ కటకం భాస్కర్ గుప్తా సంజయ్ ప్రకాష్ ఠాగూర్ హేమంత్ సింగ్ రాకేష్ అగర్వాల్ శివకుమార్ లాల్, ఎక్స్ అఫీషియమ్ నెంబర్ రామతీర్థశర్మ, వేద పండితులు వేణుమాధవ్ శర్మ తదితరులు మంత్రికి ఆహ్వానం పలికిన వారిలో ఉన్నారు.ఈ సందర్భంగా ఆగస్ట్ 2న జరిగే లష్కర్ బోనాల వేడుకలకు హాజరుకావాలని మంత్రికి ఆహ్వాన పత్రికను అందచేశారు.
శాలువాలతో సత్కరించారు. ప్రసాదాన్ని అందజేశారు.

అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించిన దానం సతీమణి అనిత.
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దేవాలయంలో ఆషాడ బోనాల జాతర సందర్భంగా హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సతీమణి దానం అనిత సోమవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో జి .మనోహర్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు దేవి వరప్రసాద్ ముప్పిడి కిరణ్, శివ కుమార్ లాల్ తదితరులు ఆమెకు స్వాగతం పలికి పూజలు నిర్వహింపజేశారు. పూజల అనంతరం ప్రసాదాన్ని అందజేశారు.
