ముండ్లమూరులో ‘ మీకోసం ‘*. మారెళ్ళ గ్రామంలో ‘ పల్లెనిద్ర ‘

ఈనెల 31వ తేదీన ముండ్లమూరులో ప్రత్యేక గ్రీవెన్స్ ( మీకోసం ) కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని దర్శి నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
           అనంతరం సాయంత్రం ఆరు గంటలకు ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ గ్రామంలో ‘ పల్లెనిద్ర ‘ చేస్తారు. గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు అందుతున్న తీరు, స్థానిక సమస్యలపై ఆరా తీస్తారు. రాత్రి అదే గ్రామంలో బస చేస్తారు. ‘ పల్లెనిద్ర ‘ లో గ్రామస్తులు ప్రస్తావించిన స్థానిక సమస్యలను మరసటి రోజు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తారు. పల్లెనిద్ర కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *