సికింద్రాబాద్, జూలై 29, (జే ఎస్ డి ఎం న్యూస్) : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్ వర్సిటీ) దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు ఆగస్టు 7 వరకు పొడిగించినట్లు బేగంపేట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. పద్మావతి తెలిపారు. కళాశాలలోని ఓపెన్ యూనివర్సిటీ ఉమెన్స్ స్టడీ సెంటర్లో 2026-27 విద్యాసంవత్సరానికి గాను బి.ఎ, బి.కామ్, బి.ఎస్సీ డిగ్రీ కోర్సులతో పాటు వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
ఇంటర్, ఓపెన్ ఇంటర్, మూడేళ్ల పాలిటెక్నిక్ లేదా ఐటీఐ పూర్తి చేసిన మహిళలు డిగ్రీ ప్రవేశాలకు అర్హులని సెంటర్ కో-ఆర్డినేటర్ డాక్టర్ మారోజు రామాచారి వివరించారు. అలాగే గతంలో ప్రవేశాలు పొంది 2వ, 3వ సంవత్సరం ట్యూషన్ ఫీజు చెల్లించని 2021, 2022, 2023, 2024 సీబీసీఎస్ బ్యాచ్ విద్యార్థులు కూడా ఆగస్టు 07వ తేదీలోగా ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఓపెన్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు
29
Jul