మన్సూరా సైబర్ హై స్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం

బేగంపేట ఆగస్ట్ 17,
(జే ఎస్ డి ఎం న్యూస్ )
ప్రకాశం నగర్‌లోని మన్‌సూరా సైబర్ హై స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో మిన్నంటాయి.
ఈ వేడుకలకు వేక్ అప్ హ్యూమానిటీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు, అడ్వకేట్ సయ్యద్ నూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల కరస్పాండెంట్ అడ్వకేట్ మొహమ్మద్ ముదస్సిర్ జుహా, ప్రిన్సిపాల్ ఎం. సుష్మ, ఇంజనీర్ మొహమ్మద్ ముజమ్మిల్ జుహా, అడ్వకేట్ జి. లలిత్ కుమార్ సహా వేక్ అప్ హ్యూమానిటీ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గేయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జాతీయ ఐక్యత, స్వేచ్ఛా స్ఫూర్తిని చాటిచెప్పేలా సాగిన విద్యార్థుల ప్రదర్శనలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను జయప్రదం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ.స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని యువతరం ముందుకు తీసుకెళ్లాలని ఆకాక్షించారు. విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణ, ఐక్యత, సామాజిక బాధ్యత పెంపొందించుకుని దేశ సేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు.అనంతరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముఖ్య అతిథికి, ప్రముఖులకు, తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయ బృందానికి యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *