జిల్లా ఫిర్యాదుల సమస్యలను నేరుగా తెలుసుకొని, వారి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మరియు పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (మీకోసం)ను నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదిదారులు తమ సమస్యలను జిల్లా ఎస్పీ కి వివరించి, సంబంధిత వ్రాతపూర్వక అర్జీలను అందించి, ఫిర్యాదుదారులతో అధికారులు ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యల పూర్తి వివరాలను, వారి ఫిర్యాదుల నేపథ్యాన్ని తెలుసుకొని, వాటిని చట్టపరంగా త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
అందిన ప్రతి ఫిర్యాదును జిల్లా ఎస్పీ పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదుపై తక్షణమే విచారణ చేపట్టి, చట్టపరమైన నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకొని బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మీకోసం” కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల విషయంలో ఎలాంటి అలసత్వం చూపకుండా, నిర్ణీత గడువులోనే పరిష్కారం అందించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.
ఫిర్యాదు చేయడానికి వచ్చే వృద్ధులు, నడవలేని పరిస్థితిలో ఉన్నవారి సమస్యలను ప్రత్యేకంగా పరిశీలనలోకి తీసుకొని, సంఘటన స్థలాలను సందర్శించి చట్టప్రకారం సత్వర న్యాయం అందించాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాల్లో కూడా అందజేయవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్, అత్తరింటి వేదింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో సింగరాయకొండ సీఐ శ్రీహరి, కొండేపి సీఐ రమణయ్య, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జున రావు, ప్యానెల్ అడ్వొకేట్ బి.బాలాజీ సింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై యాస్మిన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
