దేశ వ్యాప్తంగా పొగాకు వినియోగం తగ్గుతుందని రైతులు ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోవు పంట కాలానికి పొగాకు సాగు తగ్గించుకోవాలని బోర్డు రీజనల్ మెనేజర్ జి ఎల్ కే ప్రసాద్ కోరారు. పొగాకు బోర్డు ఒంగోలు-2 వేలం కేంద్రంలో బుధవారం ప్లోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో రీజనల్ మెనేజర్ జి ఎల్ కే ప్రసాద్ మాట్లాడుతూ అంతర్జాతీయంగా పొగాకు ఉ త్పిత్తి ఎక్కువగా ఉందని దీని ప్రభావం మన పొగాకు ఉత్పిత్తి పై పడుతుందని అన్నారు. భూమిని సారవంతం చేసుకోవటానికి తప్పనిసరిగా పంట మార్పిడి పై దృష్టి సారించాలని కోరారు. నాణ్యమైన పొగాకు ఉత్పిత్తి సాధించాలని, బ్యారన్ మరియు భూమి లీజులు పెంచుకోవద్దని చెప్పారు. ఒంగోలు-2 కేంద్రం వేలం నిర్వాహణాధికారి జె తులసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పొగాకు మార్కేట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెల్ల పొగాకు, నరైన్ లో గ్రేడ్ పొగాకు కు క్వింటాల్ కు రూ . ‘వేయ్య చోప్పున అదనంగా అందజేస్తారని చెప్పారు. బోర్డు తరపున వడ్డీ లేని రుణ పథకం ద్వారా రూ.50 వేలు ఇవ్వటానికి ప్రతి పాదించినట్లు తెలిపారు. పొగనారు పెంచదలసిన రైతులు తప్పనిసరిగా బోర్డు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. రైతులు కొనే సమయంలో తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని కోరారు. మేనేజర్ నురేఖ మాట్లాడుతూ మార్కేట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బోర్డు అనుమతి ఇచ్చిన మేర మాత్రమే సాగు చెయ్యాలని కోరారు. రైతులకు ఇచ్చే సంక్షేమ పథకాలు వడ్డీ లేని రుణాలు రూ. 50వేల నుండి రూ. లక్షకు పెంచినట్లు చెప్పారు. ఈ రునాలను మూడు వాయిదాల్లో చెల్లించాలని సూచించారు. వేలం నిర్వాహణాధికారి రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
