శివరాంపురం పులికొండ వద్ద ఏర్పాటు చేసిన గోశాల నందు గోవులు మేత కొర తతో అల్లాడుతుండగా కొత్తపాలెం గ్రామానికి చెందిన మండల తెలుగు యువత అధ్యక్షులు కైపు రామకోటిరెడ్డి ఆద్వర్యంలో రైతులు రెండు టక్కుల మొక్కజొన్న పచ్చి మేతను గురువారం అందజేశారు. గోశాల నందు గోవులకుమేత కొరతగా వుందని, సరఫరా చేయాలని స్థానిక పశువైద్యాధికారి ప్రతాప్ రెడ్డి మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులకు విన్నవించారు. గోవులకు తమవంతుగా పచ్చి మేత అందజేసేందుకు కొత్తపాలెంగ్రామ రైతు ఐ. లక్ష్మీరెడ్డి ముందుకు వచ్చారు. గ్రామానికి గోశాల దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో వున్నా తామే స్వయంగా మేత కోసి గోశాలకు ట్రాక్టర్లలో తీసు వెళ్లి అందజేశారు. పచ్చి మేతను చూడగానే గోవులు ప్రాణం లేచి వచ్చినట్లుగా మేశాయి. ఇంకా పలువురు రైతులు గోశాలకు మేత అందజేసేందుకు ముందుకువస్తున్నారని పశువైద్యాధికారి తెలిపాడు. పశుసంవర్ధకశాఖ జాయి
దుకు ముందుకువస్తున్నారని పశువైద్యాధికారి తెలిపాడు. పశుసంవర్ధకశాఖ జాయింట్
డైరెక్టర్ రవి ఆదేశాను సారం పలుగ్రామాల్లోని రైతులను సంప్రదించి గోశాలలో కొరతగా వున్న మేతను సమకూర్చేందుకు కృషి చేస్తామన్నారు. కొత్తపాలెం గ్రామానికి చెందిన రైతులు ఐ.లక్ష్మీరెడ్డి, కె. నాగార్జునరెడ్డి, ఎం.వెంకటరెడ్డిలు గోశాలకు పచ్చిమేతను అందజేశారు.
