ప్రకృతి సాగు ఉత్పిత్తులపై ప్రజలు క్రమేణా మొగ్గు చూపుతున్నారని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. తాళ్లూరులో ప్రతి సోమవారం ‘ మండే మార్కేట్ ‘ లో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముతున్నట్లు చెప్పారు. ఈ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని, రసాయనిక ఎరువులను ఉపయోగించక
ప్రకృతి పద్ధతులతో పండిస్తున్న పంటలకు నాణ్యతతో పాటు ఎక్కువ కాలం మన్నుతాయని వివరించారు.
