పొగాకు నియంత్రణపై అవగాహన సదస్సు

ఒంగోలు పొగాకు బోర్డు అనుమతి ఇచ్చిన మేర మాత్రమే రైతులు పొగాకు సాగు చెయ్యాలని ఒంగోలు – 2 వేలం నిర్వాహణాధికారి జె తులసి అన్నారు. ఒంగోలు మండలంలోని బొద్దులూరి వారి పాలెం, వలేటి వారి పాలెం గ్రామాల్లో ఎఫ్సీవీ పొగాకు పంట నియంత్రణ ఆవశ్యకతను వివరించారు. నాణ్యత గల పొగాకు ను పండించాలని కోరారు. రైతులు పొగాకు వేసే ముందు పశువుల ఎరువు విధిగా వాడుకోవాలని కోరారు. రైతు సంక్షేమ నిధి గ్రాంట్ రూ.1లక్ష వరకు పెంచారని చెప్పారు. నారు మడులు పెంచే వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కోరారు. రైతులు నారు కొనుగోలు సమయంలో రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *