మిలాద్-ఉన్-నబీ శాంతి ర్యాలీ.నేడు హైదరాబాద్ పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు.ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ విజ్ఞప్తి.

హైదరాబాద్ ఆగస్ట్ 25(జే ఎస్ డి ఎం న్యూస్)
మిలాద్-ఉన్-నబీ (ముహమ్మద్ ప్రవక్త జన్మదినం) సందర్భంగా బుధవారం హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్న శాంతి ర్యాలీ (Peace Procession) దృష్ట్యా నగరంలో విస్తృత ట్రాఫిక్ ఆంక్షలు మరియు మళ్లింపులు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు. ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు.ప్రధాన ర్యాలీలు సాగే మార్గాలు ఫలక్‌నుమా నుండి చార్మినార్ మీదుగా వోల్టా హోటల్ వరకు
• యాహియా పాషా దర్గా నుండి వోల్టా హోటల్ వరకు (తిరుగు ప్రయాణం కూడా)
• మక్కా మసీదు నుండి నాంపల్లి హజ్ హౌస్ వరకు
• మక్కా మసీదు నుండి వోల్టా హోటల్ వరకు
• పత్తర్‌గట్టి నుండి అలీజా కోట్లా వరకు
ట్రాఫిక్ మళ్లింపులు నిలిపివేసే జంక్షన్లు.
ప్రజా అవసరాల నిమిత్తం ర్యాలీ సాగే సమయంలో కింద పేర్కొన్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌నునిలిపివేయడం లేదా
ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించడం జరుగుతుంది:

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
  1. ఫలక్‌నుమా, 2) ఇంజిన్ బౌలి, 3) నాగులచింత ఎక్స్ రోడ్, 4) హిమ్మత్‌పురా జంక్షన్, 5) వోల్గా, 6) హరిబౌలి, 7) పంచమొహల్లా, 8) చార్మినార్, 9) గుల్జార్ హౌస్, 10) పత్తర్‌గట్టి, 11) మదీనా జంక్షన్, 12) ఢిల్లీ గేట్, 13) నయాపూల్, 14) ఎస్.జె. రోటరీ జంక్షన్, 15) దారుల్ షిఫా, 16) పురానీ హావేలీ, 17) మీరాలం మండి, 18) ఏతేబార్ చౌక్, 19) అలీజా కోట్లా, 20) బీబీ బజార్, 21) వోల్టా హోటల్, 22) అఫ్జల్‌గంజ్ టి జంక్షన్, 23) ఉస్మాన్‌గంజ్, 24) ఎంజే మార్కెట్ జంక్షన్, 25) తాజ్ ఐలాండ్, 26) నాంపల్లి టి జంక్షన్, 27) హజ్ హౌస్, 28) ఏఆర్ పెట్రోల్ పంప్ (నాంపల్లి).
    వాహనదారులకు విజ్ఞప్తి:
    బుధవారం ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు వాహనదారులు పైన పేర్కొన్న జంక్షన్లు, మార్గాలలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. అత్యవసర పరిస్థితులు లేదా ప్రయాణ సాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626ను సంప్రదించవచ్చని తెలిపారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సహకరించి, శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని జాయింట్ సీపీ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *