స్కై ఫౌండేషన్ మానవతా దృక్పథం
హైదరాబాద్ ఆగస్ట్ 28,(జే ఎస్ డి ఎం న్యూస్)
తోబుట్టువుల అనురాగానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి పండుగను స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినూత్నంగా, ఆదర్శప్రాయంగా నిర్వహించారు. నగరంలోని రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయుల వద్దకు వెళ్లి సంస్థ ప్రతినిధులు శుక్రవారం రాఖీ వేడుకలను జరిపారు.
ఈ సందర్భంగా వారికి రాఖీలు కట్టి స్వీట్లు, పండ్లు, బిస్కెట్లు, తాగునీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. తమను కుటుంబ సభ్యుల్లా భావించి ఆప్యాయత చూపించడంతో పలువురు నిరాశ్రయులు భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. తమకు ఈ విధంగా పండుగ సంతోషాన్ని పంచినందుకు స్కై ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఓ. పావని తదితరులు పాల్గొన్నారు.


