అద్దంకి ఆగస్ట్ 28,(జే ఎస్ డి ఎం న్యూస్) :
హైకోర్టు న్యాయవాది బాచినహనుమంతరావు హైకోర్టులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసులు వాదించడానికి నామినేటెడ్ కౌన్సిల్ గానియమితగాయ్యారు.పంగులూరు గ్రామానికి చెందిన బాచిన హనుమంతరావు హైకోర్టు న్యాయవాది గా సేవలు అందిస్తున్నారు.
తాజాగా విజయవాడలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సర్కిల్ కార్యాలయం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఇప్పటికే బాచిన హైకోర్టులో అనేక ప్రభుత్వ జాతీయ బ్యాంకులకు న్యాయవాదిగా సేవలు(కేసులు వాదిస్తున్నారు) అందిస్తున్నారు.
గతంలో కూడా ఏ జీ పీ గా ,పలు బ్యాంకులు ప్రభుత్వ సంస్థలతో స్టాండింగ్ కౌన్సిల్ గా సేవలు అందించారు.ఈ సందర్భంగా పలువురు బాచిన హనుమంతరావుకు అభినందనలు తెలియజేశారు.
