ఐజేయు 11 వ జాతీయ ప్లీనరీ సావనీర్ ను మంత్రులు నిమ్మల, గొట్టిపాటి,పొంగూరు,ఆనం లకు అందజేసిన APUWJ రాష్ట్ర అధ్యక్షులు ఐవి.

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU )11 వ జాతీయ ప్లీనరీ సమావేశానికి సంబంధించిన సావనీర్ ను ఏపి యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (APUWJ) రాష్ట్ర అధ్యక్షులు ఐవి. సుబ్బారావు గారు శనివారం సాయంత్రం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే లకు అందజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా ఐవి సుబ్బారావు గారు ఐజేయు ప్లీనరీ విశేషాలను, ప్రాముఖ్యతను వివరించిన అనంతరం సావనీర్ ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఎం అశోక్ రెడ్డి, నక్క ఆనందబాబు, మద్దిపాటి వెంకట రాజు, వై పాలెం నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి జి.ఎరిక్షన్ బాబు గార్లకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ జర్నలిస్టు సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం ఎప్పుడూ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో APUWJ రాష్ట్ర అధ్యక్షులు ఐవి. సుబ్బారావు గారితో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా యూనియన్ అధ్యక్షులు ఎన్ వి. రమణ, యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మూల అల్లూరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *