ఈ నెల 31 (సోమవారం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వెలిగొండ జల ప్రదాత మాన్య నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి, నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా దోర్నాల మండలం గంటవాని పల్లి గ్రామ వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు , రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ , రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి , రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ , రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి , మార్కాపురం జిల్లా కలెక్టర్ఎం విజయ సునీత , మార్కాపురం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు , మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి , కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి , వినుకొండ శాసన సభ్యులు జీవి ఆంజనేయులు , గోపాలపురం శాసన సభ్యులు మద్దిపాటి వెంకట రాజు , యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు , ముఖ్యమంత్రి టూర్ కోఆర్డినేటర్ రఘు , వెలిగొండ ప్రాజెక్ట్ అధికారులు మరియు దోర్నాల మండల నాయకులతో కలిసి సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్, వెలిగొండ ప్రాజెక్ట్ పనులు, ఫీడర్ కెనాల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు మరియు ఇతర అంశాలపై అధికారులతో సమీక్షించారు.
వెలిగొండ జలాలతో యర్రగొండపాలెం నియోజకవర్గ రైతుల చిరకాల స్వప్నం సాకారం కానున్న ఈ చారిత్రాత్మక ఘట్టానికి నియోజకవర్గ ప్రజలు, రైతులు, యువత, మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని గూడూరి ఎరిక్షన్ బాబు పిలుపునిచ్చారు.



