బేగంపేట ఆగస్ట్ 30,(జే ఎస్ డి ఎంన్యూస్) :
సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్ జాన్ ఆదేశాల మేరకు, ఎస్ ఐ ఆర్ రెండవ దశలో భాగంగా సనత్‌నగర్ అసెంబ్లీనియోజకవర్గంలోని బేగంపేట్ డివిజన్‌కు డి సి సి సెక్రటరీ,ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు దేవీ వర ప్రసాద్‌ను పరిశీలకుడిగా నియమించారు.ఈ మేరకు సనత్‌నగర్ అసెంబ్లీనియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కోటా నీలిమా ఆదేశాల మేరకు ఆయన బేగంపేట్ డివిజన్‌లో పర్యటించారు. బేగంపేట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ నసీర్(అడ్డు)తో కలిసి డివిజన్‌లోని వివిధ పోలింగ్ స్టేషన్లనుకాలినడకన సందర్శించారు. ఈ సందర్భంగా దేవీ వర ప్రసాద్ సంబంధిత బూత్‌ల బి ఎల్ ఏ లు మరియు బి ఎల్ ఓ లతో మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్
కార్యకలాపాలను వివరంగాసమీక్షించారు. ఆయన నేరుగా నోటీసులు జారీ అయిన ఓటర్లను కూడా కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా దేవీ వర ప్రసాద్ మాట్లాడుతూ, రెండవ దశలో ఎవరికైనా నోటీసులు జారీ అయితే భయపడాల్సిన అవసరం లేదని,
బి ఎల్ ఓ మరియు ఎన్నికల సంఘం కోరిన పత్రాలను సమర్పిస్తే వారి ఓటు సురక్షితంగా ఉంటుందని అన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు ఎన్నికల సంఘం నిర్ణయించిన రోజున తప్పనిసరిగా హాజరు కావాలని, అర్హులైన ఓటర్ల ఓటునుకాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ శాయశక్తులా కృషి చేస్తోందని, కాంగ్రెస్ నాయకులు బూత్ స్థాయిలో కష్టపడి పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో సెక్రటరీ మరియు డివిజన్ అబ్జర్వర్ దేవీ వర ప్రసాద్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ సూపర్‌వైజర్ రాజేందర్, ఎన్నికల సంఘంసూపర్‌వైజర్ కిషోర్ మరియు కాంగ్రెస్ నాయకులు సిద్ధిక్ ఖాన్, మునీర్ ఖాన్, హనీఫ్ ఖాన్, జమీర్, ధనలక్ష్మి, మొహమ్మద్ సలీం, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.

