30 ఏళ్ల వెలిగొండ స్వప్నం సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాకారమైంది -కరువు నేలకు కృష్టా జలాలు తీసుకొచ్చిన అపర భగీరధుడు సీఎం చంద్రబాబు -ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే వెలుగొండ పూర్తి చేశాం -వెలిగొండ కోసం 11 గ్రామాల ప్రజలు.. చేసిన త్యాగం ఎన్నటికీ మరువులేం -చివరి నిర్వాసితుని వరకు పరిహారం అందించి న్యాయం చేస్తాం -మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

ప్రకాశం/ ఆగస్టు, 30 :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

30 ఏళ్ల వెలిగొండ స్వప్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాకారమైందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ… నాలుగు జిల్లాల ప్రజల ఆకాంక్షకు 30 ఏళ్ల క్రితం అంకురార్పణ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. నేడు ప్రాజెక్టును ప్రారంభించడం ఒక చరిత్ర. ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే వెలుగొండ పూర్తి చేసి మూడు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలికాం. వెలిగొండ జలాలతో 4 జిల్లాల్లో లక్షల మంది ప్రజల భవిష్యత్తు మారనుంది. పశ్చిమ ప్రకాశంలో ఇక వలసలు ఉండవు. మొదటి దశలో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఈ మహా యజ్ఞం పూర్తి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రజల తరపున కృతజ్ఞతలు. వెలిగొండ కోసం 11 గ్రామాల ప్రజలు..చేసిన త్యాగం మరువులేం. చివరి నిర్వాసితుని వరకు పరిహారం అందించి న్యాయం చేస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *