ఆరోగ్యంగా ఉండాలంటే నడక,పరుగు తో పాటు మానసిక దృఢత్వం కలిగి ఉండాలి. ఉద్యోగులు, కుటుంబ సభ్యులను ప్రోత్సహించినవిన్ ఫో సొల్యూషన్స్.

హైదరాబాద్, ఆగస్టు 31,(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే నడక,పరుగు తో పాటు మానసిక దృఢత్వం కలిగి ఉండాలనీ విన్ ఫో సొల్యూషన్స్ సంస్థ సి ఈ ఓ హరి సేతల పతి అన్నారు.
ఎన్ ఎం డి సి హైదరాబాద్ మారథాన్ 10K రన్ ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. విన్ ఫో సొల్యూషన్స్ సంస్థ సి ఈ ఓ
హరి సేతలపతి నాయకత్వం , ప్రోత్సాహంతో ఉద్యోగులు,వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యం, ఫిట్‌నెస్, ఐక్యతను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో 9 ఏళ్ల వయసు కలిగిన యువరాజు ఆరెడ్ల పాల్గొని, నిర్ణీత సమయంలో 10K పరుగును విజయవంతంగా పూర్తి చేయడం గర్వకారణం. చిన్నారులను ఫిట్‌నెస్, చురుకైన జీవనశైలిని అలవర్చుకునేలా ప్రోత్సహించడం ఎంత ముఖ్యమో యువరాజు సాధించిన ఈ విజయం తెలియ జేసింది.యువరాజు తండ్రి, విన్ ఫో సొల్యూషన్స్ లో అసోసియేట్ డైరెక్టర్‌. గా ఉన్న బాల రాజు ఆరెడ్ల, తన కుమారుడి విజయంపై
ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించడం అలాగే ఆరోగ్యం, ఫిట్‌నెస్, ఐక్యతకు ప్రాధాన్యతనిచ్చే సంస్కృతిని పెంపొందిస్తున్నందుకు విన్ ఫో సొల్యూషన్స్ యాజమాన్యానికి, సి ఈ ఓ హరి సేతలపతికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ జేశారు.ఇలాంటి మారథాన్ లు నగరంలో నిర్వహించడం ఎంతో అవసరం అని,నిత్యం పని ఒత్తిడితో ఉండే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఇలాంటి మారథాన్ లు ఉపశమనం కలిగిస్తాయని బాల రాజ్ అరెడ్ల అభిప్రాయం వ్యక్తం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *