బేగంపేట సెప్టెంబర్ 1,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రకాశం నగర్ డివిజన్ శ్యామ్ లాల్ బిల్డింగ్ తాతాచారి కాలనీ ఇందిరాగాంధీ పురం రోడ్డులో చెత్త పేరుకు. పోవడం పై జే ఎస్ డి ఎం న్యూస్ లో ,,వీళ్ళు వేయడం మానరు.వాళ్ళు తీయడం తప్పదు,,.అనే కథనం ప్రచురితమైంది.స్పందించిన పారిశుధ్య విభాగం అధికారులు,సిబ్బంది సహకారంతో జే సి బి తో పాటు
టీ ప్పర్లు ఏర్పాటు చేసి రోడ్డుపై పేరుకు పోయిన చెత్త కుప్పలను తొలగించారు.శ్యామ్ లాల్ బిల్డింగ్ అంబేద్కర్ నగర్ బస్తీ వద్ద కూడా పేరుకు పోయిన చెత్త కుప్పలను తొలగించారు కథనం ప్రచురితమైన కొద్ది గంటల్లోనే అధికారులు స్పందించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

