బేగంపేట సెప్టెంబర్ 2,(జే ఎస్ డి ఎం న్యూస్) :
బీజేపీ ‘కులతత్వ’ వైఖరినిఖండించిన కాంగ్రెస్ సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు
దీపక్ జాన్ నాయకత్వంలో గాంధీ విగ్రహం నుంచి బాంబే హోటల్ చౌరస్తా వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగాసికింద్రాబాద్ డీసీసీ
అధ్యక్షుడు దీపక్ జాన్ మాట్లాడుతూ, పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే హల్ద్వానీ ర్యాలీ వేదికను ‘శుద్ధి’ చేయడంలో పాలుపంచుకున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినందుకు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం బీజేపీ యొక్క హేయమైన కులతత్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై దాడి చేయడానికి బీజేపీ,ఆర్ఎస్ఎస్లు రాష్ట్ర
బలాబలాలను ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు.ఈ సందర్భంగా దీపక్ జాన్ మాట్లాడుతూ, “రాజ్యాంగంలో పొందుపరచబడిన సాంఘిక న్యాయ విలువలపై బీజేపీ దాడి చేసింది. ఈ దాడిని కాంగ్రెస్ తీవ్రంగాప్రతిఘటిస్తుంది. ఖర్గేను అవమానించిన అసలు దోషులకు శిక్ష పడే వరకు, రాహుల్ గాంధీపై నమోదైన ఈ నిరాధారమైన ఎఫ్ఐఆర్ను చెత్తబుట్టలో పడేసే వరకు మేము విశ్రమించమన్నారు.
ప్రభుత్వ ప్రేరేపిత వేధింపులకు కాంగ్రెస్ భయపడదు,సాంఘిక న్యాయం కోసం అవిశ్రాంతంగాపోరాడుతుంది” అని అన్నారు.ఈ నిరసన ప్రదర్శనలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్, సనత్నగర్ ఇన్చార్జ్ డాక్టర్ కోట నీలిమ, అరవింద్ కుమార్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, సీనియర్
నాయకులు విశాల్ సుధాం,బేగంపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నసీరుద్దీన్ (అడ్డు),చిరంజీవి ,ఎం. ఏ అజీజ్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



