కెసిఆర్ కిట్లతో లక్షలాది మంది పేదలకు మేలు చేకూరింది ఎమ్మెల్యే తలసాని.

బేగంపేట సెప్టెంబర్ 2 (జే ఎస్ డి ఎం న్యూస్) :
కేసీఆర్ కిట్ లతో లక్షలాది మంది పేదలకు మేలు చేకూరిందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి పుట్టినరోజు సందర్భంగా అమీర్ పేట లోని ప్రభుత్వ హాస్పిటల్ లో 30 మంది బాలింతలకు కేసీఆర్-తలసాని కిట్ లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలింతలు, పిల్లలకు అవసరమైన బట్టలు, మెడిసిన్, సబ్బులు, ఆయిల్స్, బొమ్మలు వంటి వాటితో కూడిన కిట్ లను దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం అందజేసిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్ ల పంపిణీ ని ఆపేసిందని విమర్శించారు. ఈరోజు నామన శేషుకుమారి తన పుట్టినరోజు సందర్భంగా తిరిగి అవే కిట్ లను అందజేయడం పట్ల అభినందించారు. ఈ ప్రాంత పేద, మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని 50 పడకల హాస్పిటల్ గా అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. అనంతరం ధరం కరం రోడ్డులోని లక్ష్మీ నర్సింహ విలాస్ లో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలలో ఎమ్మెల్యే సమక్షంలో శేషుకుమారి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, బి ఆర్ ఎస్ పార్టీ అమీర్ పేట, సనత్ నగర్ డివిజన్ అధ్యక్షులు హన్మంతరావు, కొలన్ బాల్ రెడ్డి, నాయకులు నామన సంతోష్ కుమార్, సురేష్ గౌడ్, దాడి ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి,టిల్లు బాయ్, మధు సూధన్ రావు, పీయూష్ గుప్త, ఖలీల్, శేఖర్, కొలన్ భూపాల్ రెడ్డి, గౌతమ్, గోపీలాల్ చౌహన్, వనం శ్రీనివాస్, బాసా లక్ష్మీ, రాణి కౌర్, అనితరెడ్డి, దుర్గ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *