గాంధీ ఆస్పత్రి నూతన సూపరింటెండెంట్‌గా ప్రొఫెసర్‌ ఉషారాణి బాధ్యతల స్వీకరణ.

సికింద్రాబాద్ సెప్టెంబర్ 8,(జే ఎస్ డి ఎం న్యూస్)
సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి నూతనసూపరింటెండెంట్‌గా ప్రొఫెసర్‌ ఉషారాణి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్‌సూపరింటెండెంట్‌గా సేవలందించిన ప్రొఫెసర్‌ వాణి డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ)గా పదోన్నతి పొందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్‌ ఉషారాణిని ప్రభుత్వం గాంధీ సూపరింటెండెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బాధ్యతల స్వీకరణ అనంతరం ఆస్పత్రి పాలనా యంత్రాంగం, వైద్యులు, సిబ్బంది ఆమెకు ఘనంగా స్వాగతం పలికి
శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ ఉషారాణి మాట్లాడుతూ, ఆస్పత్రి సిబ్బంది అందరి సమన్వయంతో పేద రోగులకు మరింత నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడమే తన ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. గాంధీ ఆస్పత్రి వంటి ప్రతిష్టాత్మక సంస్థ బాధ్యతలను తనకు అప్పగించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తూ, డీఎంఈ వాణిలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *