బేగంపేట సెప్టెంబర్ 10,(జే ఎస్ డి ఎం న్యూస్) :
తాము ఎలాంటి ఆందోళనలు చేయకున్నా ఆందోళనతో గృహనిర్బంధం చేయడం ఏంటి.బీ ఆర్ ఎస్ నేతలంటే కాంగ్రెస్ కు అంత భయమెందుకు అని బేగంపేట బీ ఆర్ ఎస్ నాయకులు టి .శ్రీహరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా తమ ఎమ్మెల్యేలను గేటు బయటే అడ్డు కొన్నారని , బీ ఆర్ ఎస్. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును కూడా తెలంగాణా ప్రజలు ముక్త కంఠంతో ఖండించారని,తమ అధినేతలు కేసీఆర్ , కే టి ఆర్ ,హరీష్ రావు తదితరులపై పోలీసులు చేసిన దౌర్జన్యం,వ్యవహరించిన తీరు కూడా ఎంతో బాధాకరం అని శ్రీహరి ఆక్షేపించారు. తమ పార్టీ ఎలాంటి ఆందోళనలకు పిలుపు ఇవ్వక పోయినా గురువారం కూడా తామందరినీ గృహ నిర్బంధం చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.ఇప్పటికైనా ప్రభుత్వం బీ ఆర్ ఎస్ నాయకులపై గృహ నిర్బంధాలను నిలువ రించాలని ,లేదంటే ప్రజలు ఈ ప్రభుతానికి తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఇలాంటి బెదిరింపులకు బీ ఆర్ ఎస్ నాయకులు,కార్యకర్తలు బెదిరి పొరనీ అన్నారు.ఉద్యమాలతో ఉవ్వెత్తున ఎగసి పదవులను తృణ ప్రాయంగా త్యాగం చేసిన చరిత్ర తమ నాయకుడు కే సి ఆర్,తో పాటు తమ నాయకులకు ఉందని శ్రీహరి అన్నారు.ఇలాంటి అక్రమ నిర్బంధాలకు తాము ఎప్పుడూ భయపడమని. ఈ నిర్బంధాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
