రామభద్రాపురం గ్రావంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన రైతులకు 70 ఏళ్ల నుండి ఉన్న భూమిని అందించి న్యాయం చేయాలని రామ భద్రాపురం గ్రామస్తులు జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారికి విన్నవించారు. రామభద్రాపురం గ్రామస్తులకు చెంది ఎంతో కాలంగా వివాదంగా కొనసాగుతున్న సోమవప్పాడు నర్వే నంబర్ 320లోని 208 ఎకరాల భూమిని జాయింట్ కలెక్టర్ గురువారం పరిశీలించారు. వివరాల్లోకి వెలితే ……వెంకటగిరి రాజుల కాలంలో పశువుల మేత పోరం బోకుగా వున్న భూమిని రామభద్రాపురం గ్రామస్తులకు కేటాయిస్తూ ఆభూమికి కస్టోడియన్ గా ఇరవై మంది పేర్ల దాదాపు 70ఏళ్ల కిత్రం రైతువారి పట్టాలు ఇచ్చారు. దీంతో ఆభూమిని పశువుల మేతకు వినియోగిస్తున్నారు. వారిలో కొందరు తమ దంటూ తమ పేరున ఆన్లైన్ చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఆభూమిని సొంతానికి వాడుకునేందుకు కొందరు యత్నిస్తుండగా 20 కుటుంబాలకు చెందిన వారు అడ్డుకుంటూ, అధికారుల చుట్టూ నాలుగు దశాబ్దాలుగా తిరుగుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు జేసీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆమె భూమి వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు సోమవారప్పాడు సర్వేనంబర్ 320లోని 208 ఎకరాలను పరిశీలించారు. ఇద్దరు రైతులు ఆభూమిలో రెండు వందల ఎకరాలు తమదని, తమ వద్ద అందకు సంబంధించిన కాగితాలు ఉన్నాయని జేసీకి విన్నవించారు. భూమి మీదయితే ఇంతవరకు ఎందుకు సాగుచేయలేదని జేసీ వారిని ప్రశ్నించారు. దీంతో పట్టాలున్న 20 కుటుంబాలకు చెందిన వ్యక్తులు జేసీ వద్ద తమ గోడు వెళ్లబోనుకున్నారు. తమకు పెద్దల నాటి నుండి ఆ భూమిలో 10 ఎకరాల వంతున 20 మందికి ఖాతా నంబర్ 520తో రికార్డుల్లో నమోదు చేసి రైతు వారి పట్టాలు ఇచ్చారన్నారు. ఆభూమిలో రాళ్లతో కూడి ఉన్నందున సాగు చేసుకునేందుకు ఆర్థిక స్థోమత మిన్నకున్నామన్నారు. రైతుకుటుంబాలకున్యాయం చేయాలి జేసికీ విన్నవించారు. అభూమిలో సాగర్ కాలువ పోగా తమ 20 కుటుంబాలకు నష్టపరిహారం కూడా అందజేశారన్నారు. ఇటీవల ఆపొలంలో జేకేవీ రోడ్డు నిర్మాణం చేస్తూ ప్రభుత్వం నష్టపరిహారంగా 20 మందిలో ముగ్గురికి రివార్డు కూడా ఇవ్వటం జరిగిందన్నారు. 20 మందికి చెందిన రైతులకు నదరు భూమిలో రైతుల వారి పట్టాలుండగా గ్రామానికి తూము చిననాగిరెడ్డి, మరోకరుతమదంటూ రెవెన్యూ అధికారులతో కుమ్ముక్కవుతూ తమకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. ఎంతో కాలంగా ఆభూమిని నమ్ముకున్నామని, తమకు ఆ భూమిని ఆన్లైన్ చేసి న్యాయం చేయాలని గ్రామ మాజీ సర్పంచ్ గాజుల కోటేశ్వరరావు, గ్రామస్తులు జేసీకి విన్నవించారు. తమ వద్ద వున్న రికార్డు పత్రాలకు జేసీకి అం దజేశారు. రికార్డులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమం లో అద్దంకి ఆర్ డీఓ విజయజ్యోతికుమారి, కలెక్టర్ కార్యాలయ ఏవో నాగలక్ష్మి, తహ సీల్దార్ బి.వి.రమణారావు, డీటీ ఫణీంద్ర, మండల నర్వేయర్, మహేష్ బాబు, ఆర్ ఐ నుధీర్ కుమార్, విఆర్వో రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


