సైన్స్ ద్వారానే నమాజ అభివృద్ధి సాధ్యమని మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య, ఎంఈఓ–2 నుధాకర్ రావు అన్నారు. తూర్పుగంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మండల స్థాయి చెకుముకి సంబరాలు నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక ద్వారా టాలెంట్ విద్యార్థులలో సైన్స్ జ్ఞానాన్ని పెంపొందిస్తున్నట్లు చెప్పారు. 13 పాఠశాలలకు చెందిన విద్యార్థులు టెస్ట్లో పాల్గొన్నారు. అందులో లక్కవరం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రధమ స్థానంలో నిలవగా, సరస్వతి హైస్కూల్ విద్యార్థులు ద్వితీయ స్ధానంలో, జెడ్పీహెచ్ ఎస్ నాగంబొట్ల పాలెం, గీతాంజలి, వెలుగు వారి పాలెం విద్యార్థులు తృతీయ స్థానంలో నిలచారు. ప్రధానోపాధ్యాయుడు వై ఎస్ ఆర్కే ప్రసాద్, అంజలి, గాంధీ, ఉపాధ్యాయులు కె సింగా రెడ్డి, దివ్య, శ్రీనివాస రావు, జనవిజ్ఞాన వేదిక కె సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు .

