శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక మాసం…ఎమ్మెల్యే తలసాని.

బేగంపేట సెప్టెంబర్ 11(జే ఎస్ డి ఎం న్యూస్) :
హిందూ ధర్మం లో శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక మాసం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా రాంగోపాల్ పేట డివిజన్ లోని జీరా లో గల శ్రీ సంతోషి మాత అమ్మవారిని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శాలువాతో ఘనంగా సత్కరించి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు ప్రేమ్, లక్ష్మీపతి, టి. శ్రీహరి, కుమార్ యాదవ్, అరుణ్ గౌడ్, రాజేందర్, జనార్దన్, నాగభూషణం, గణేష్, చంద్ర ప్రకాష్, అభిషేక్, రంజిత్, సాయి, అబ్బాస్, ఆలయ కమిటీ సభ్యులు మనోజ్ కుమార్, అనుపమ, కృష్ణరాజు, గణేష్, సంజయ్ తదితరులు ఉన్నారు.
గణపతుల పంపిణీ
మట్టి గణపతులను ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శుక్రవారం జీరాలో మట్టి గణపతి విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. శిబిరంలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *