అర్హులైన ప్రతి కుటుంబానికీ సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం……కొత్త స్మార్ట్ రేషన్ కార్డులతో పేదలకు మరింత ప్రయోజనం – డాక్టర్ కోట నీలిమ.

రాంగోపాల్ పేట , సెప్టెంబర్ 11,(జే ఎస్ డి ఎం. న్యూస్) :
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలుఅందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు.
రాంగోపాల్‌పేట్ డివిజన్ చుట్టల్‌బస్తీలోని అర్బన్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీకాంత్ చారి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో డాక్టర్ కోట నీలిమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం కల్పించేలా 15 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసిందని తెలిపారు. గతంలో వివిధ కారణాలతో రేషన్ కార్డులు
పొందలేకపోయిన అర్హులైన కుటుంబాలకు ప్రస్తుతం కొత్త కార్డులు అందించడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు మరింత సులభంగా అందనున్నాయని పేర్కొన్నారు.రేషన్ కార్డు కేవలం గుర్తింపు పత్రం మాత్రమే కాదని, పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆహార భద్రత అందించేందుకు ఇది కీలక ఆధారమని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.38 కోట్ల మంది ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.పేదల జీవన ప్రమాణాలనుమెరుగుపరిచేందుకు సంక్షేమపథకాలతో పాటు ఆహార భద్రతను మరింత బలోపేతం చేసే చర్యలను ప్రభుత్వం నిరంతరంచేపడుతోందన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగంచేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ప్రయోజనాలు అందేలా స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.
అర్బన్ హాస్పిటల్‌లో వైద్య సేవలపై ఆరా.
రేషన్ కార్డుల పంపిణీ అనంతరం డాక్టర్ కోట నీలిమ గవర్నమెంట్ అర్బన్ హాస్పిటల్‌నుసందర్శించారు. ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బంది, రోగులతో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్వహణ, ప్రభుత్వ సహకారం, రోగులకు అందుతున్న సౌకర్యాలు, వైద్య సేవలపై ఆరా తీశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పసుపు బొట్టు కార్యక్రమంలో మహిళలతో ఆత్మీయంగా.

అనంతరం బేగంపేట డివిజన్ మాతాజీ నగర్‌లో స్థానిక మహిళా నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన పసుపు బొట్టుకార్యక్రమంలో డాక్టర్ కోట నీలిమ పాల్గొన్నారు. మహిళలకు పసుపు బొట్టు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సౌభాగ్యంతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు.
హైదర్‌బస్తీలోని శ్రీ సంతోషిమాత ఆలయాన్ని డాక్టర్ కోట నీలిమ సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *