సనత్నగర్ సెప్టెంబర్ 16(జే ఎస్ డి ఎం న్యూస్)
సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్ పరిధిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సనత్నగర్ పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీన ఉదయం 5:30 గంటల సమయంలోభరత్నగర్లోని ‘హైదరాబాద్ టీ హౌస్’ వెనుక రోడ్డు పక్కన ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు డయల్ 100కు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సనత్నగర్ పోలీసులు, బాధితుడిని మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి పరిస్థితి విషమించి మంగళవారం సాయంత్రం 6:40 గంటలకు మృతి చెందినట్లు డ్యూటీ వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి సంబంధించిన వివరాలు ఏవీ లభించకపోవడంతో ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పై ఫొటోలో ఉన్న వ్యక్తికి సంబంధించి ఏమైనా వివరాలు తెలిసిన వారు సనత్నగర్ ఎస్ఐ వెంకటేశం (8712581139) లేదా 8712680289 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు కోరారు.
