తాళ్లూరుః క్షేత్ర స్థాయిలో నూతనంగా దరఖాస్తు చేసుకున్న ఎన్ టిఆర్ భరోసా పెన్షన్లు పరిశీలించాలని, ఇతర ప్రభత్వ పథకాలపై ప్రజలకు అవగాహన పెంచాలని జిల్లా జిల్లా స్వర్ణ వార్డు అధికారి ఎం వెంకటేశ్వర రావు కోరారు. మండలంలోని శివరామపరం స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన అకస్మిక తనిఖీ నిర్వహించారు. ఇప్పటి వరకు 121 దరఖాస్తులు రాగా ఎందుకని ఒక్కటి కూడ క్షేత్ర స్థాయిలో పరిశీలించలేదని ప్రశ్నించారు. ఈనెల 21లోపు పరిశీలన పూర్తి కావాలని, అక్టోబర్ 1 నుండి నూతనంగా అర్హులైన వారికి పెన్షన్ అందుతుందని చెప్పారు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్సీ గురించి, అధార్ క్యాంపుల గురించి, కౌశలం గురించి ప్రజలకు అవగాహన పెంచాలని చెప్పారు. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్సన్ ( పీ పీ పీ) ఐవీ ఆర్ ఎస్ ద్వారా వచ్చే ప్రశ్నలకు ప్రజలకు అభిప్రాయాలు సేకరించబడుతున్నాయని సరియైన రీతితో ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ఎస్ జీ ఎస్ డబ్ల్యు ఉద్యోగి విధిగా చేయ్యాల్సిన పనులను గుర్తు చేసారు. ప్రతి రికార్డును ఎప్పటికప్పుడు పూర్తి చెయ్యాలని సకాలంలో ప్రజలకు సేవలు అందించాలని కోరారు. డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస రావు, స్థానిక నాయకులు గాడిపర్తి లక్ష్మి నారాయణ, హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.


