ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని ఆలయం హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించినట్లు ఆలయ ఈఓ ఎన్ నారాయణ రెడ్డి తెలిపారు. 2026 ఎప్రియల్ నాలుగు నుండి 2026 సెప్టెంబర్ 18 వరకు హుండీ ఆదాయం రూ. 7,83,246లు వచ్చినట్లు చెప్పారు. ఆదాయం కౌంటింగ్ సేవలో బొద్దికూర పాడుకు చెందిన భక్తులు పాల్గొన్నారు. కందుకూరి డివిజన్ ఇన్స్ఫెక్టర్ జి సత్య నారాయణ, ఆలయ చైర్మన్ సానే సురేష్, పెద్దలు ఎమ్మని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
