జన సేన బలోపేతానికి సమిష్టిగా కృషి చెద్దామని వక్తలు అన్నారు. గుంటి గంగా భవాని వద్ద కాకతీయ అన్నదాన సత్రంలో శనివారం జన సేన మండల కార్యకర్తల సమావేశం ఆపార్టీ మండల అధ్యక్షుడు కూటాల ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. పార్టీలోనికి నూతనంగా వచ్చిన జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, బెల్లంకొండవారి పాలెం మాజీ నర్పంచి పోశం సుమలత శ్రీకాంత్ రెడ్డిలను సాదరంగా ఆహ్వానించారు. శాలువాలు కప్పి స న్మానించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయి పోటీ చేయటానికి సిద్దంగా ఉండాలని అందుకు అందరూ ఆయా గ్రామాలలో సిద్ధంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో మారిశెట్టి హనుమంత రావు, తోట క్రిష్ణ, యర్రంశెట్టి చిరంజీవి, వేణు, కోటేశ్వరరావు, వెంకట రావు, బో ఏను, కూటాల పవన్, మలిశెట్టి సుబ్బా రావు గంగుల వెంకట రావు, సుజాత, గాజుల బాల కృష్ణ , అశోక్, బద్రి, రాంబాబు, చెన్నంశెట్టి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
