అవర్ సేక్రేడ్ స్పేస్’ వేదికగా ‘పూంపుహార్’ మెగా హస్తకళల ప్రదర్శన…..10 రోజుల పాటు ఉదయంనుంచి సాయంత్రం 8గంటల వరకు ఆదివారాలు కూడా అందుబాటులో…

హైదరాబాద్ సెప్టెంబర్ 26,(జే ఎస్ డి ఎం న్యూస్) :
అవర్ సేక్రేడ్ స్పేస్’ వేదికగా ‘పూంపుహార్’ మెగా హస్తకళల ప్రదర్శన సికింద్రాబాద్ లో జరగనుంది.10 రోజుల పాటు ఉదయం 10గంటల నుంచి నుంచి సాయంత్రం 8గంటల వరకు ఆదివారాలు కూడా అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలియ జేశారు.అవర్ సేక్రేడ్ స్పేస్’ వేదికగా 10 రోజుల పాటు ‘పూంపుహార్’ మెగా హస్తకళల ప్రదర్శన సాగనుంది.పూంపుహార్’ అనే బ్రాండ్ పేరుతో ప్రసిద్ధి చెందిన తమిళనాడు హస్తకళల అభివృద్ధి సంస్థ దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా కళాకారులు రూపొందించిన కళాఖండాలను కళాభిమానులకు చేరువ చేస్తోంది. తద్వారా కళాకారుల ఉత్పత్తులను ప్రోత్సహించి, విక్రయించడం ద్వారా కళాకారుల జీవనోపాధిని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ సంస్థ ఇలాంటి ప్రదర్శనలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా తమిళనాడు హస్తకళల అభివృద్ధి సంస్థ (పూంపుహార్) తెలంగాణలోని సికింద్రాబాద్, ఈస్ట్ మారేడ్‌పల్లి (సర్దార్ పటేల్ రోడ్, ఆర్కిడ్స్ ఫ్లవర్ పక్కన, హిమాలయ బుక్ వరల్డ్ ముందు) వద్ద ఉన్న ‘అవర్ సేక్రేడ్ స్పేస్’ వేదికగా 10 రోజుల పాటు (ఆదివారంతో సహా) “మెగా హస్తకళల ప్రదర్శన”ను నిర్వహిస్తోంది. ఈ ప్రదర్శనను శనివారం ఉదయం ‘అవర్ సేక్రేడ్ స్పేస్’ వ్యవస్థాపకురాలు నయన తార, తమిళనాడు హస్తకళల అభివృద్ధి సంస్థ అధికారుల సమక్షంలో ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో తమ ప్రత్యేకమైన సాంప్రదాయ హస్తకళలు, చేనేత ఉత్పత్తులను ప్రదర్శించడానికి, విక్రయించడానికి తమిళనాడులోని వివిధ జిల్లాల నుండి 30 మంది కళాకారులు పాల్గొని వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. కళాకారులు తమ ఉత్పత్తులను కళాభిమానులకు నేరుగా అందుబాటు ధరలకు విక్రయిస్తారు. ఈ ప్రదర్శన వారి ఆదాయాన్ని పెంచుతుందని మరియు వారి జీవనోపాధికి తోడ్పడేందుకు ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో కంచు విగ్రహాలు, ఇత్తడి సాంప్రదాయ దీపాలు, తంజావూరు చిత్రాలు, తంజావూరు కళా ఫలకాలు, పేపియర్-మాషే బొమ్మలు, చెక్క శిల్పాలు, రాతి శిల్పాలు, ఇత్తడి కళాకృతులు, మట్టి మరియు టెర్రకోట ఉత్పత్తులు, బెత్తపు ఫర్నిచర్, అరటి పీచు ఉత్పత్తులు, జనపనార ఉత్పత్తులు, తాటాకు ఉత్పత్తులు, ఫ్యాషన్ ఆభరణాలు, అగరబత్తీలు మరియు సుగంధ ద్రవ్యాలు, చేతితో నేసిన వస్త్రాలు, చేనేత వస్త్రాలు, ఇంకా అనేక ఇతర హస్తకళా ఉత్పత్తుల వంటి తమిళనాడు సాంప్రదాయ హస్తకళలను ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనకు ప్రవేశం ఉచితం. ఇది శనివారం నుండి అక్టోబర్ 4.వరకు ప్రతిరోజూ (ఆదివారాలతో సహా) ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిర్వహిస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *