తాళ్లూరు మండలంను కరువు మండలంగా ప్రకటించాలి -డీకే పాడు స్పందనలో వినతి

తాళ్లూరు: సరియైన వర్షాలు లేక పంటలు లేక మండలంలో వాగులు, వంకలు పూర్తిగా ఎండిపోయి, భూగర్భజలాలు అడుగంటటంతో నీరు అందక పంటలు కూడ ఎండిపోయాయని, పశుగ్రాసం కూడ దొరకని పరిస్థితిలో మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని దర్శి ఎఎంసీ డైరెక్టర్ నల్లపాటి సత్యనారాయణ విన్నవించారు. దోసకాయలపాడులో సోమవారం మీ కోసం పీజీఆర్ఎస్ కార్యక్రమం ఎంపీడీఓ అజిత అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీడీఓ అజిత మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు అధికంగా ఉన్నా సభకు కనీస సంఖ్యలో రాక పోక పోవటంపై అసంతృప్తి వ్యక్తం చేసారు. బెల్లంకొండ వారి పాలెం మాజీ సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డి గ్రామంలో సర్వే నంబర్ 23/7లో రిజిస్ట్రేషన్ భూములను రెవిన్యూ అధికారులు తప్పుగా ఆన్లైన్లో మరొకరి పేరుపై నమోదు చేసారని, తమకున్న రికార్డుల ఆధారంగా ఆన్లైన్లో నమోదు చెయ్యాలని కోరారు. గతంలో రెవిన్యూ అధికారులకు తమ వద్ద ఉన్న ఆధారాలు సమర్పించినప్పుడు పాస్ పుస్తకం కూడ ఇచ్చారని చెప్పారు. రీ సర్వే అంటూ తమ వద్ద ఉన్న రికార్డును పరిశీలించకుడా మరోకరి పేరుపై నమోదు చేసారని అన్నారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు మాట్లాడుతూ గత మూడు నెలలుగా వర్షపాతం తక్కువగా నమోదు అయినందున పరిస్థితులను ఉన్నతాధికారులకు నివేదించామని చెప్పారు. మంచి నీరు సక్రమంగా రావటం లేదని సభ దృష్టికి తెచ్చారు. స్పందనలో పంచాయితీ రాజ్ డిపార్ట్మెంటుకు సంబంధించి మూడు, రెవిన్యూ సమస్యలపై నాలుగు వినతులు వచ్చినట్లు ఎంపీడీఓ అజిత తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ జి ఫణీంధ్ర, ఎంఈఓ సుబ్బయ్య, డిప్యూటీ ఎంపీడీఓ వి శ్రీనివాస రావు, ఎఈఓ రామక్రిష్ణా రెడ్డి, హనుమంత రావు, వాలి, ఏబీఎన్ దేవరాజ్ ,ఏపీవో వెంకటేశ్వరరావు, విఆర్ఓ , సిబ్బంది పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *