తాళ్లూరు గ్రంధాలయ భవణ నిర్మాణ పనులపరిశీలన

తాళ్లూరులో నిర్మాణ చేపడుతున్న తాళ్లూరు శాఖా గ్రంధాలయ నిర్మాణ పనులను దర్శి పంచాయతీ రాజ్ డీఈ మాధవరెడ్డి సోమవారం పరిశీలించారు. తాళ్లూరులో 1956లో శాఖా గ్రంథాలయంను ఏర్పాటు చేశారు. స్వంత భవనం లేక అద్దె భవనంలో నడుస్తున్నది. దీంతో స్వర్గీయ ఇడమకంటి చిన కోటిరెడ్డి కృషితో బోడిరెడ్డి ఇంటి వెనుక స్థలాన్ని సమకూర్చారు. కోటిరెడ్డి కుమారుడు ఐవీరెడ్డి విన్నపం మేరకు రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి గ్రంథాలయ శాశ్వత భవన నిర్మాణం కోసం ఎంపీగ్రాంట్ నుండి 35 లక్షల నిధులు మంజూరు చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కావటంతో పంచాయతీ రాజ్ అధికారులు నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టారు. గ్రంధాలయంకు కేటాయించిన స్థలంలో చుట్టూ ప్రక్కల వారు, ఆ స్థలం లో రోడ్డు నిర్మానం చేప్పట్టగా వున్న స్థలంలో భవనాన్ని నిర్మిస్తున్నారు. డీఈ మాధ వరెడ్డి పనులు పరిశీలించి రెండు నెలల్లో శ్లాబ్ పనులు పూర్తి చేసి గ్రంధా లయ భవనం వినియోగంలోకి తీసుక వస్తామన్నారు. ఎంతో కాలంగా స్థలం లేక పక్కాభవనం లేక అద్దె భవనంలో కొనసాగు తుండగా దీర్ఘకాలిక సమస్యను పరిష్క రిస్తూ ఎంపీ వైవి.సుబ్బారెడ్డి నిదులు కేటాంచటంతో భనవ నిర్మాణ పనులు జరు
గుతుండటంతో గ్రంధ పాఠకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *