తాళ్లూరు: మండలంలోని బెల్లంకొండ వారి పాలెం పంచాయితికి సుదీర్ఘకాలం 15 ఏళ్ల పాటి సర్పంచిగా పనిచేసిన పోశం నారాయణ రెడ్డి (76) మంగళవారం గుండె పోటుతో మృతి చెందారు. ఆయన ప్రధాన పార్టీలు తెలుగు దేశం, కాంగ్రెస్, వైసీపీలలో పనిచేసి నిత్యం ప్రజా సేవలు ఉంటూ గ్రామాభివృద్దిలో తనదైన పాత్ర పోషించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానిగా ఆయన కాంగ్రెస్లో కొనసాగుతూ ఆయన మరణానంతరం వైసీపీలో పనిచేసారు. ఆయనకు భార్య, ఇరువురు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా చిన్న కుమారుడు పోశం మధుసూధన రెడ్డి, వైసీపీలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, ఎంపీపీగా పనిచేసాడు. దివంగత ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బా రెడ్డికి సన్నిహితుడిగా, దివంగత ఎంపీపి ఎంవీ సుబ్బా రెడ్డి, మాజీ సర్పంచి మారం ఇంధ్రసేనా రెడ్డిలు మండలంలో త్రయంగా ఏర్పడి మంచి రాజకీయాన్ని నడిపించి మండల అభివృద్ధిలో తమదైన పాత్ర పోషించారు. అనంతరం బూచేపల్లి కుటుంబానికి మరింత దగ్గరగా రాజకీయం నడిపారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలు ఆయన పార్టీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, ఇంటలిజెన్స్ సంఘరాష్ట్ర కార్యదర్శి ఐవీ సుబ్బా రెడ్డి, మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే, దర్శి మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకట రెడ్డి, మాజీ సర్పంచి మారం ఇంద్రసేనా రెడ్డి, సోముదుర్గా రెడ్డి, శ్రీనివాస రెడ్డి, గోపాల్ రెడ్డి, కొండా రెడ్డి, గుజ్జుల యోగి రెడ్డి, పులి బ్రహ్మా రెడ్డి, క్రిష్ణా రెడ్డి, మాజీ సర్పంచిలు, ఎంపీటీసీలు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.




Save or share this story as a newspaper-style Epaper Clip: