ఒంగోలు వైభవం చాటేలా…. నేడు అంగరంగ వైభవంగామున్సిపాలిటీ 150 ఏళ్ల వేడుకలు . తరలిరానున్న అతిరథ మహారధులు*. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు,ఒంగోలు గిత్తల ప్రదర్శనతో సంబరాలు … ఉదయం 9 నుంచే ప్రారంభం…….. రాత్రి 10.15 గంటలకు క్రాకర్స్ షో తో ముగింపు…… అల్పాహారం, భోజనాలు అన్నీ అక్కడే….. ప్రజలందరూ తరలిరావాలి….. కలెక్టర్, ఎంపీ మాగుంట , ఎమ్మెల్యే జనార్దన్, తేజస్విని పిలుపు

చారిత్రక నగరమైన ఒంగోలు విశిష్టతను చాటిచెప్పే సమయం సమీపించింది. నాలుగు నెలలుగా విడతలవారీగా సాగుతున్న సంబరాలు ఏకమై అంబరాన్ని అంటే గడియ ఆసన్నమైంది. ఒంగోలు మున్సిపాలిటీ శతాబ్దిన్నర వేడుకల నిర్వహణకు నగరం సర్వసన్నద్ధమయింది. సరిగ్గా 150 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న మున్సిపాలిటీ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ, ఈ ప్రయాణంలో సాధించిన మైలురాళ్లను ఘనంగా తెలియజేస్తూ, త్యాగానికీ పౌరుషానికీ ప్రతిభకు ప్రతీకలుగా నిలిచిన వారిని స్మరించుకుంటూ, నగర కీర్తిని సగర్వంగా చాటి చెప్పిన అసమాన్యులను గౌరవించుకుంటూ, ఆద్యంతం ఆహ్లాదకరంగా, సాంస్కృతిక కనువిందుగా చరిత్రలో చిరస్థాయిలో నిలిచేలా ఒంగోలు ఉత్సవాలు బుధవారం జరుగనున్నాయి. స్థానిక మినీ స్టేడియంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10:15 గంటల వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. మంగళవారం ప్రకాశం భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఒంగోలు కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ మరియు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు, రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ చైర్మన్ శ్రీమతి పొడపాటి తేజస్విని, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణయ్య ఈ వేడుకలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కార్యక్రమాలు ఇలా…

*. ఉదయం 9 గంటలకు స్థానిక కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు.
*. 10 గంటలకు మాండొలిన్ స్వరాలు ( సుభాని బృందం ).
*. 10:10 గంటలకు శాస్త్రీయ నృత్య ప్రదర్శన ( ఆక్సా ఖాన్ బృందం ).
*. 10:30 గంటలకు ఒంగోలు తొలి అడుగులు ( దృశ్య, శ్రవణ ప్రదర్శన ).
*.10:50 గంటలకు వేదిక పైకి అతిథుల స్వాగతం.
*. 11 గంటలకు జాతీయ గేయం ఆలాపన.
*. 11:10 గంటలకు జ్యోతి ప్రజ్వలన.
*. 11:15 గంటలకు అతిథుల సందేశాలు.
*. 12:15 గంటలకు పురస్కారాలు, సన్మానాలు.
*. 12:30 గంటలకు డప్పుల ప్రత్యేక ప్రదర్శన.
*. 12:45 గంటలకు సాంస్కృతిక ప్రదర్శనలు ( సన్నీ డాన్స్ మాస్టర్ బృందం )
*. మధ్యాహ్నం ఒంటిగంటకు వందన సమర్పణ.
*. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మినీ స్టేడియం నుంచి ట్రంకు రోడ్డు మీదుగా అద్దంకి బస్టాండ్ వరకు ఒంగోలు గిత్తల ప్రదర్శన మరియు ఒంగోలు గిత్తల అందాల పోటీలు.
*. సాయంత్రం 5:30 గంటలకు స్థానిక కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు.
*. 6:30 గంటలకు తప్పెటగుళ్ళు ( ప్రత్యేక ప్రదర్శన ).
*. 6:45 గంటలకు స్వాగత సుమాంజలి ( అయానా డాన్స్ బృందం ).
*. రాత్రి 7 గంటలకు ఒంగోలు 150 ఏళ్ల ప్రస్థానం ( దృశ్య, శ్రవణ ప్రదర్శన ).
*. 7:10 గంటలకు ఒంగోలు వైభవ నృత్యం ( 150 మంది కళాకారిణులచే నిర్వహణ).
*. 7:30 గంటలకు వేదిక పైకి అతిథుల ఆహ్వానం.
*. 7:35 గంటలకు జాతీయ గేయం ఆలాపన.
*. 7:40 గంటలకు జ్యోతి ప్రజ్వలన.
*. 7:45 గంటలకు అతిధుల సందేశాలు.
*. 8:30 గంటలకు పురస్కారాలు, సన్మానాలు మరియు సావనీర్ ఆవిష్కరణ.
*. 8:45 గంటలకు ట్రాన్ యాక్ట్ ( రాయల్ డాన్స్ కంపెనీ ).
*. 9 గంటలకు సాంస్కృతిక ప్రదర్శనలు ( సన్నీ డాన్స్ మరియు ఆక్సా ఖాన్ బృందం ).
*. 9:15 గంటలకు నీత ( లైవ్ బ్యాండ్ ).
*. 10:15 గంటలకు వందన సమర్పణ మరియు జాతీయ గీతాలాపన, క్రాకర్స్ షో నిర్వహణ.

తరలిరానున్న అతిథులు

       ఈ వేడుకలలో మాజీ ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు, ఒడిశా గవర్నర్   కంభంపాటి హరిబాబు, అసెంబ్లీ స్పీకర్   చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు  ఆనం రామ నారాయణరెడ్డి, జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్ డోలా  బాల వీరాంజనేయ స్వామి,   గొట్టిపాటి రవికుమార్, పలువురు ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు.
 ప్రతిఘట్టం అట్టహాసంగా నిర్వహించే ఈ వేడుకల్లో లక్షలాదిగా ప్రజలు పాల్గొనాలని కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే, తేజస్విని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం ఏర్పాట్లను కూడా చేసినట్లు తెలిపారు. 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *